నాగ్ 'ఢమురకం' సాంగ్స్ ట్రాక్ లిస్ట్
హైదరాబాద్ : నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొంది రిలీజుకు రెడీ అవుతున్న చిత్రం ఢమురుకం. ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది.
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ట్రాక్ లు ఏమిటంటే...
పాట 01: ఓంకార సృష్టి
సింగర్స్ : వెంకట సాయి
పాట 02: పంచగ్రహ కూటం
సింగర్ : కార్తీక్
పాట 03: నేస్తమా ..నేస్తమా
సింగర్స్ : శ్రీకృష్ణ , హరిణి
పాట 04: రెప్పలపై
సింగర్స్ : హరిహరన్, మిరాయిడ్ ప్రో
పాట 05: ధీంతన..
సింగర్స్ : శంకర్ మహదేవన్
పాట 06: సక్కు బాయి
సింగర్స్ : సుచిత్ సురేషన్, మమతా శర్మ
పాట 07: లాలి లాలి
సింగర్స్ : గోపిక పూర్ణిమ
పాట 08: భూనభోంతలకే..
సింగర్స్ : ఎమ్.ఎల్.ఆర్.కార్తి కేయన్
పాట 09: కన్యా కుమారి
సింగర్స్ : జస్పీత్ , సునీత
పాట 10: శివ శివ శంకర
సింగర్స్ : శంకర మహదేవన్
ఇక ఈ చిత్రం అక్టోబర్ 12 అనుకున్న రిలీజ్ తేదీని అక్టోబర్ 18కి మార్చినట్లు తెలుస్తోంది. భాక్సాఫీస్ వద్ద 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రిజల్ట్ ని బట్టి ఆ డేట్ మరింత ముందుకు వెళ్తుందా లేదా అని తేలుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అఫీషియల్ గా నిర్మాతలు తేదీ నిర్ణయించలేదు


Click it and Unblock the Notifications











