'డమరుకం' టైటిల్ వివాదం...కోర్టు ధిక్కరణ కేసు

By Srikanya

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఢమరుకం సినిమా టైటిల్ మాదే అంటూ మొదలైన వివాదం ముదిరింది. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోనుంది. డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డమరుకం టైటిల్‌ వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన చెప్పారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ డమరుకం సినిమా పేరును వాడుతున్నారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టనున్నట్టు తెలిపారు.

డమరుకం టైటిల్ తాను 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు. ఈ కారణంగా నాగార్జున నటించిన డమరుకం చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఢమరుకం సినిమా టైటిల్ తమదని, 80 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని, కానీ ఆర్ఆర్ మూవీస్ వారు తమ టైటిల్ వాడుకుంటున్నారని అర్ణవ్ మూవీస్ అధినేతలు ప్రమోద్‌కుమార్‌గౌడ్, నవీన్‌కుమార్ తెలిపారు. 2008లో తమ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్టు చెప్పారు.

తాము ఆడియో విడుదల సన్నహాల్లో ఉండగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి తమను సంప్రదించి, టైటిల్ ఇవ్వమని అడిగారని, తమ సినిమా ఖర్చు ఇచ్చేస్తామని చెప్పారని తెలిపారు. కానీ వారు మాటతప్పడంతో తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. అయితే తమ సినిమా పేరు ఢమరుకం కాదని, ధమరుకమని హైకోర్టును కూడా తప్పుపట్టించారని, ఇప్పుడు డమరుకం పేరుతో సినిమా విడుదల చేస్తున్నారన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టనున్నట్టు తెలిపారు.

. సృష్టి ఆవిర్భావం మొదలయ్యింది డమరుక నాదం నుంచేనని దర్శకుడు శ్రీనివాసరెడ్డి చెప్పారు. సృష్టి, స్థితి, లయ కారకం డమరుకం అని, డమరుక శబ్దం నుంచే ఓంకారం పుట్టిందన్నారు. ఓం ఆరంభం.....పదునాలుగు భువనభాండాలు డమరుక శబ్దం నుంచే పుట్టాయని, అలాంటి శక్తివంతమైన టైటిల్‌ ఈ చిత్రానికి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఆ టైటిలే ఇప్పుడు పెద్ద సమస్య అయింది.

విడుదలలో చోటు చేసుకొంటున్న జాప్యం గురించి నాగార్జున మాట్లాడుతూ ''ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డమరుకం సినిమాకు ఇంకా శివుడి ఆజ్ఞ లభించలేదు. అందుకే చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుంది. విడుదల కోసం అభిమానులందరూ శివుడికి అభిషేకాలు చేయాలి'' అన్నారు. నాగ్-అనుష్క జంటగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన డమరుకం చిత్రం విడుదల మళ్లీ వాయిదాపడింది. ఇప్పుడు చిత్రం టైటిల్ చిక్కుల్లో పడింది. నాగార్జున నటించిన ఏ సినిమా విడుదల కూడా ఇన్నిసార్లు వాయిదాపడలేదు. ఈ సినిమా విడుదల విషయం అంతా అయోమయం, గందరగోళంగా తయారైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X