నాగార్జున "గగనం" రిలీజ్ డేట్ మళ్లీ మారింది
నాగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "గగనం" చిత్రం రిలీజ్ ని జనవరి 1 వ తేదీకి వాయిదా వేసారు. ఈ విషయాన్ని మీడియాకి తెలియచేస్తూ నిర్మాత దిల్ రాజు.. ''హైజాక్ నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది. తెలుగులో ఈ తరహా చిత్రం రావడం ఇదే తొలిసారి. ప్రతి సన్నివేశం ఉత్కంఠను కలిగిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించడం వల్ల నిర్మాణపరంగా జాగ్రత్తలు తీసుకొన్నాం. ఇదో ప్రయోగాత్మక చిత్రమే అయినా వాణిజ్య అంశాలు అన్నీ ఉంటాయ''న్నారు. విమానం హైజాక్, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది అన్నారు.
అలాగే గగనంలో తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ...కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్ హైజాగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్ అని చెప్పాలి. మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది అన్నారు. బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్ కౌర్, భరత్ రెడ్డి, రిషి తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: కె.కబీర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











