ప్రత్యేక విమానంలో మన వూరికి నాగార్జున
నాగార్జున ఫిబ్రవరి 10 వ తేదీన రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాలకు ప్రత్యేక విమానంలో హాజరు కానున్నారు. ఆయన తాజా చిత్రం 'గగనం' ప్రమోషన్ నిమిత్తం నిర్మాత దిల్ రాజు ఇలా ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తూ...'' రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు విరుద్ధంగా కొత్త తరహాలో సాగే చిత్రమిది. అందుకే పబ్లిసిటీని కూడా వినూత్నంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. విడుదలకు ముందే మీడియావారికి 'గగనం' చిత్రం చూపిస్తాం. సినీ ప్రముఖల కోసం ఓ ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. అలాగే ప్రేక్షకులకూ 'గగనం' సినిమాని ముందే చూపించాలి అనుకొంటున్నాం. ఫిబ్రవరి 10న రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో నాలుగు ఆటలు ప్రదర్శిస్తాం. నాలుగు చోట్లకు నాగార్జునను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతామన్నారు.
ఈ చిత్రంలో నాగార్జున కమాండోగా చేస్తున్నారు. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నాగార్జున. ఫ్లైట్ హైజాగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది. ఈ చిత్రంలో కత్తి లో చేసిన సనాఖాన్ ప్రయాణికుల్లా చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: కె.కబీర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











