అలా చేస్తే ప్రేక్షకులు చెప్పుతో కొడతారు..నాగార్జున

By Srikanya

ఈ సినిమాలో పాటలు లేవు. ఇలాంటి సినిమాలో పాటలు పెడితే చెప్పుతో ప్రేక్షకులు కొడతారు అంటూ తమ తాజా చిత్రం 'గగనం" గురించి నాగార్జున చెప్పుకొచ్చారు. నాగార్జున హీరోగా రాధామోహన్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'గగనం". ఈ చిత్రం తాజా విశేషాలను తెలపటానికి ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ధ్రిల్లింగ్ చిత్రం ఇది. కాందహార్ హైజాక్ సంఘటన ప్రేరణగా తీసుకుని దర్శకుడు ఎంతో స్టడీ చేసి ఈ చిత్రం రూపొందించాడు. ఇక ప్లైట్ హైజాక్ అయిన తర్వాత లోపల ఉన్న ప్రయాణికులు, బయిట ఉన్న కమెండోలు, ప్రభుత్వం ఈ మూడు అంశాలతో చిత్రం కథ నడుస్తుంది. హైజాక్ అయిన ప్రయాణికులు మూడు రోజులు పాటు తమ సీట్లలో ఎలా కూర్చున్నారు. వారి భావోద్వేగాలు ఏమిటన్నది చాలా ఆసక్తికరం అన్నారు.

కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్పాలి. మంచి ఎమోషనల్‌ డ్రామా కూడా ఉంది.

అలాగే ఇది ఒక ఇంటిలిజెంట్ గేమ్. కమిండోల జీవితం త్యాగపూరితంగా ఉంటుంది. వారు కష్టపడి పట్టుకున్న టెర్రరిస్టులను కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం వదిలేస్తే వారి మనోభావాలు ఎలా ఉంటాయో ఊహించలేము. ఇక ఈ సినిమా చూసి తెలుగు వారు గర్వంగా ఫీలవుతారు. తెలుగు వారు కూడా ఇంత మంచి చిత్రాలు చేస్తారన్న విషయం ఈచిత్రం తో రుజువువుతుంది అన్నారు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ... 'గగనం" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నవంబర్ రెండో వారంలో తెలుగు,తమిళ్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.

తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది అన్నారు. బ్రహ్మానందం, సనాఖాన్‌, పూనమ్ కౌర్‌, భరత్‌ రెడ్డి , రిషి తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, కళ: కె.కబీర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X