రేపే నాగార్జున చారిత్రక చిత్రం ఓపినింగ్
నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే చారిత్రిక చిత్రం 'రాజన్న' రేపే(11-10-2010) న భారీ ఎత్తున ప్రారంభంకానుంది. నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటించనుంది. ఇక విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. ఇక ఈ చిత్రం కథ రజాకార్ల ఉద్యమం నేఫద్యంలో జరగుతుంది. ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు. అలాగే రాజమౌళి ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాగే ఈ సినిమాలో తన పాత్ర..తన పాతికేళ్ళ నటనా కెరీర్ ని మలుపుతిప్పే పాత్ర అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో కామాక్షి ఎంటర్ ప్రైజస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. అనుష్క,ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.అలాగే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే సోషియో ఫాంటసీ చిత్రం కూడ త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











