నాగార్జున'లవ్ స్టోరీ'లేటెస్ట్ ఇన్ఫో
నాగార్జున,నయనతార కాంబినేషన్ లో దశరధ్ రూపొందిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 20నుంచి మొదలు కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 'ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 20 నుంచి జరుగుతుంది, యు.ఎస్ లో 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. నాగార్జున ఇమేజ్‌కి తగిన విధంగా డైరెక్టర్ దశరథ్ ఈ సబ్జెక్టుని అద్భుతంగా రూపొందించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని డిసెంబర్లో గానీ, జనవరిలోగానీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
దర్శకుడు దశరత్ హాట్లాడుతూ..'అమెరికాలోనే పుట్టి పెరిగిన హీరో ఎన్ఆర్ఐగా ఫస్ట్ టైమ్ ఇండియా వస్తారు. అతని అనుభవాలతో ఈ కథ రూపొందించడం జరిగింది. శివప్రసాద్ రెడ్డిగారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ బేనర్లో సినిమా చెయ్యాలన్న కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది. నాగార్జునగారు చేసిన సంతోషం, మన్మథుడు తరహాలో ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సంతోషం తర్వాత నాగార్జునగారితో మళ్లీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాగార్జున చాలా కొత్తగా ఉంటారు. అలాగే కథ కూడా చాలా ఇంట్రస్టు గా ఉంటుంది' అన్నారు.
నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ : అనిల్ బండారి, సంగీతం : థమన్, ఆర్ట్ : ఎస్. రవీందర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్ : కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే : హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే : ఎం.ఎస్.ఆర్ : ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వివేక్, కో ప్రొడ్యూసర్ : డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత : డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం : దశరథ్


Click it and Unblock the Notifications











