మరో బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్న నాగార్జున!

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున మంచి నటుడు, నిర్మాత మాత్రమే కాదు....తెలివైన వ్యాపారి. డబ్బులు ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగా వస్తాయో తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా రెస్టారెంట్ వ్యాపారంలో మంచి లాభాలు ఉండటంతో ఇప్పటికే ఆయన ఎన్-గ్రిల్, ఎన్ ఏసియన్ రెస్టారెంటుల్లో పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఆయన మరో బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్-డిస్ట్రిక్ట్' పేరుతో రోడ్ నెం.59, జూబ్లీహిల్స్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

నాగార్జున సినిమాల విషయానికొస్తే...త్వరలో ఆయన "సోగ్గాడే చిన్ని నాయన" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాత, మనవడు పాత్రల్లొ ద్విపాత్రాభినయం చేసి నాగార్జున సరికొత్త వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారట. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో తాతపాత్ర చేయబోతున్న నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తారు. మనవడి పాత్ర పోషించే నాగార్జున సరసన హీరోయన్ గా తొలుత తమన్నా అనుకున్నా.. ఆమె పారితోషికం విని షాకయ్యి..లావణ్య త్రిపాఠి తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Nagarjuna's new restaurant N-District

నాగార్జున మాట్లాడుతూ....ఆష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రామ్మోహన్ తయారు చేసిన కథతో చిత్రం చేస్తున్నా. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. పల్లెటూరి అనుబంధాలు, ఆప్యాయతలతో ఆద్యంతం ఆహ్లాదకరంగా వుంటుంది. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నాను. హలో బ్రదర్ తరహాలో ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే వుంటుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. ఇద్దరూ హీరోయిన్‌లకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఎంపికైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సన్‌షైన్ పిక్చర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X