సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఆఫీసర్’

By Bojja Kumar

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ 'ఆఫీసర్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆర్ కంపెనీ ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున, మైరా సెరీన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శంకర్ సంగీత అందించారు. సౌండ్ ఎఫెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Nagarjunas Officer gets U/A

చాలా కాలం తర్వాత నాగార్జున ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. నిజ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నట్లు దర్శకుడు తెలిపారు. బాంబేలో ఒక రియల్ ఐపీఎస్ ఆఫీసర్‌ను కలిసినపుడు ఆయన చెప్పిన ఓ విషయం నుండి ఈ ఆలోచన వచ్చింది. అది నేను డెవలప్ చేసిన వెంటనే నాకు నాగార్జున గుర్తుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత అసలైన హీరోయిజం తెరపై చూపిస్తూ 'ఆఫీసర్' చేశాను అని వర్మ తెలిపారు.

ఈ సినిమాకు వందశాతం కమిట్మెంటుతో చేశాను. ఒక హిట్ సినిమాకు చాలా మంది కారణం అవుతారు. ప్లాప్ అయితే డైరెక్టరే కారకుడు. సినిమా అనేది ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. దాన్ని క్రియేట్ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ సినిమా ద్వారా నన్ను నేను, ఒక వ్యక్తిగా రీ ఇన్వెంట్ చేసుకున్నట్లు భావిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నాగార్జునదే అని వర్మ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X