నాగ్-కార్తి ‘ఊపిరి’: ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ (వీడియో)
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాకు ‘ఊపిరి' అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేసి చిత్రం మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.
కథకనుగుణంగా ఈ టైటిల్‌ను ఓకే చేసిన్నట్టు సమాచారం. గ్లామర్ తార తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పోస్టర్ విడుదల సందర్బంగా నాగార్జున చేసిన ట్వీట్ ని ఈ క్రింద చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.
''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.
''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.

ఇక ఈ చిత్రం కథ ఓ ఫ్రెంచ్ సూపర్ హిట్ ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 2011 లో వచ్చిన The Intouchables ఆధారంగా ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు సీనియర్,మరొకరు జూనియర్. ఈ చిత్రం ఫన్ తో కూడిన డ్రామా గా నడుస్తుంది. అయితే ఈ విషయం నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని పి.వి.పి సంస్ధ తీసుకుందని మరో వార్త వినపడుతోంది. అదే నిజమైతే అఫీషియల్ రీమేక్ గా చెప్పుకోవాలి. ఇప్పటివరకూ ఈ విషయమై అదికారికంగా ఏ సమాచారమూ లేదు.
హైదరాబాద్, చెన్నైలలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్.


Click it and Unblock the Notifications











