నాగార్జున "రగడ" చిత్రం సెన్సార్ కట్స్ ఇవే
నాగార్జున, అనుష్క, ప్రియమణి కాంబినేషన్ లో వీరూపోట్ల రూపొందించిన చిత్రం 'రగడ'. శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ రూపొందించింది. డి. శివప్రసాద్‌రెడ్డి ఈ చిత్రం నిర్మించారు. రగడ చిత్రాన్ని చూసిన ఇ.సి. 22-12-2010న 10 కట్స్‌తో 'ఎ' సర్టిఫికెట్ జారీచేసింది.
1. ధూమపానంకి సంబంధించిన దృశ్యాలు చిత్రంలో ఎక్కడ వచ్చినా తొలగించమని లేదా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక వుంచమన్నారు.
2. ఒకటి రెండు రీళ్ళలో దేవుడు అన్న శరీరం నుంచి రక్తం కారే దృశ్యాలను తొలగించారు.
3. ఒకటి రెండు రీళ్ళలో దాబా హోటల్లో చిత్రీకరించిన ఫైట్ యొక్క నిడివి తగ్గించారు.
4. ఒకటి రెండు రీళ్ళలో 'మీసమున్న మన్మథుడు పాటకు చార్మి నాట్యం చేస్తూ పొట్టవద్ద వున్న బటన్‌ని ఎక్స్‌పోజ్ చేసే దృశ్యాన్ని తొలగించారు.
5. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన జైలు సన్నివేశాల్లో పోలీసులు ధూమపానం చేసే దృశ్యాన్ని తొలగించారు.
6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో 'పప్పు బ్యాచ్' అని వచ్చే డైలాగ్ కత్తిరించారు.
7. మూడు నాలుగు రీళ్ళలో భగవాన్ ఇంట్లో చిత్రీకరించిన ఫైట్ యొక్క నిడివి తగ్గించారు.
8. పదమూడవ రీలులో చిత్రించిన దృశ్యంలో గల 'నీయమ్మా జీవితం' అనే మాటల్లోని 'నీయమ్మా' పదం తొలగించారు.
9. పదమూడవ రీలులోని క్లయిమాక్స్ ఫైట్స్‌లో కత్తిని గుచ్చడం తొలగించారు.
10. పదమూడవ రీలులోని క్లయిమాక్స్ ఫైట్ యొక్క నిడివిని తగ్గించారు.
పదమూడు రీళ్ళ నిడివిగల 'రగడ' చిత్రం 24-12-2010న విడుదల అయింది.


Click it and Unblock the Notifications











