twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున 'రగడ' మ్యూజిక్ లాంచ్ డేట్..వెన్యూ

    By Srikanya
    |

    నాగార్జున, వీరూ పోట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న'రగడ' చిత్రం ఆడియో విడుదల నవంబర్ 29 రాత్రి శిల్ప కళా వేదికలో జరగనుంది. రీసెంట్ గా బృందావనం చిత్రానికి సంగీతం అందించిన తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు. బిందాస్ చిత్రం విజయంతో ఉన్న వీరూపోట్ల రెండో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రియమణి, అనూష్క హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై డి శివ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.

    నాగార్జున ఈ చిత్రం విజయంపై మంచి నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. హాలో బ్రదర్‌', 'అల్లరి అల్లుడు' తరహాలో చిత్రాలు చేయాలని చాలా రోజులుగా నా మనసులో ఉంది. అలాంటి చిత్రాలకు యాక్షన్‌ని జోడిస్తే ఎలా ఉంటుందో 'రగడ' చిత్రంలో చూడొచ్చు అంటున్నారు. నాగార్జున. కడపలో మార్కెట్ యార్డ్ నడిపే వ్యక్తిగా నటిస్తున్నా. అందుకే నా పాత్రకి రాయలసీమ యాస పెట్టాడు డైరెక్టర్ అన్నారు.

    డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియమణి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, రఘుబాబు, ప్రదీప్‌రావత్, దేవ్‌గిల్, సుశాంత్‌సింగ్, సత్యప్రకాష్, సుప్రీత్, శ్రావణ్, డా. భరత్‌రెడ్డి, రఘు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: తమన్ ఎస్., నిర్వహణ: కె.చెంచురెడ్డి, సహనిర్మాతలు: డి.విశ్వచందన్‌రెడ్డి, డి.వెంకటకైలాష్‌రెడ్డి, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరు పోట్ల.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X