‘శిరిడి సాయి’గా నాగ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ఈ సందర్భంగా ఈ చిత్రవిశేషాలను నాగార్జున తెలియజేస్తూ -''అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడిగా నటించిన నాకు ఈ చిత్రంలో శిరిడి సాయి పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇది నాకు ఓ మరపురాని చిత్రం అవుతుంది. రాఘవేంద్రరావుగారితో చేస్తున్న మరో గొప్ప భక్తిరసాత్మక చిత్రం ఇది. సాయిబాబా భక్తులైన మహేష్‌రెడ్డిగారు ఎంతో అభిరుచితో, భక్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు'' అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కథాసంకలనం: భక్త సురేష్ డి., కథాసహకారం: పొందూరి హనుమంతరావు, ఫొటోగ్రఫి: ఎస్.గోపాల్‌రెడ్డి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వేదవ్యాస్, సత్తిపండు, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్.


Click it and Unblock the Notifications











