హిట్ కోసమేనా...నాగార్జున 'తులాభారం' తూగింది?

By Srikanya

మొన్న ఆదివారం నాగార్జున కేరళ గురవాయర్ లోని కృష్ణ మందిరాన్ని సందర్శించారు. అంతేగాక అక్కడ ప్రసిద్ది చెందిన తులాభరణంలో పాల్గొని ..స్వామి వారికి తాను తూగిన డబ్బై ఏడు కేజీల అరటి పళ్ళను సమర్పించారు. అయితే అక్కడ ఆయన్ని ఆయన అభిమానులు చుట్టిముట్టి ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు. తిరుచూర్ లోని ఓ వివాహానికి ఆయన హాజరై ఆ తర్వాత ఇక్కడకు వెళ్ళి భగవంతుడుకి ప్రార్ధన చేసి ఈ తులాభార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కేరళలోనూ తనను గుర్తుపట్టి అభిమానులు గుమిగూడటం ఆయన్ని చాలా సంతోషపరిచిందని చెప్తున్నారు.

ఇక ఇక్కడ హీరోలు తాము ప్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చి తులాభారం తూగటం ఆనవాయితి. ఆ మధ్య శికర్ చిత్రం రిలీజ్ కు ముందు మళయాళ సూపర్ స్టార్ వరస ప్లాఫ్ లతో సతమతమవుతూ..తులాభారం లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి తన స్ధానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దిలీప్...కార్యస్ధాన్ చిత్రం విడుదల సమయంలోనూ ఇక్కడ తులాభారం తూయించుకున్నాడు. అంతవరకూ ఆయన పెద్ద ప్లాపులలో కూరుకుపోయి ఉన్నాడు. ఇక రీసెంట్ గా రావణ్ వంటి మెగా ప్లాపుల్లో ఉన్న పృధ్వీరాజ్...ఇక్కడ తులాభారం కు వచ్చి...అర్జున్ సాక్షి అనే హిట్ ఇచ్చారు. ఇక నాగార్జున తాజా చిత్రం గగనం ఈ నెల పదకొండవ తేదీన విడుదల కానుంది. ఆయనకు ఈ తులాభారం ఎఫెక్టు ఏ విధంగా పడనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X