»   » తనలా వాళ్ల జీవితంలో జరగొద్దనే? చైతు, అఖిల్ వివాహంపై నాగార్జున స్పందన!

తనలా వాళ్ల జీవితంలో జరగొద్దనే? చైతు, అఖిల్ వివాహంపై నాగార్జున స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ కొంతకాలంగా మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమలో పడటమే ఇందుకు కారణం. నాగ చైతన్య తన సహ నటి సమంతతో ప్రేమలో పడటం, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక అఖిల్ తన స్నేహితురాలు, హైదరాబాద్ కు చెందిన డిజైనర్ శ్రేయ భూపాల్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు.

ఇద్దరు కుమారులు తమ తమ లైఫ్ పార్ట్‌నర్స్‌ను వారే ఎన్నుకోవడంతో ఇటు నాగార్జున కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే కొంత కాలంగా ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరి వివాహం ఒకే తేదీన జరుగుతుందని ఆ రూమర్స్ సారాంశం.

తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడిన నాగార్జున తమ ఇద్దరి కుమారుల వివాహంపై స్పందించారు. ఇద్దరి వివాహం ఒకే తేదీన జరుగుతుందనే వార్తల్లో నిజం లేదని నాగార్జున స్పష్టం చేసారు. వెడ్డింగ్ డేట్స్ కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదని నాగార్జున తెలిపారు. పైనల్ డెసిషన్ ఏమిటనేది తమ ఇద్దరు కుమారులకే వదిలేసాను, వారు ఎప్పుడు అంటే అప్పుడు వివాహం జరిపించడానికి తాను రెడీ అన్నట్లుగా నాగార్జున స్పందించారు.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన విశేషాలు..

ఇద్దరివీ ఎంజాయ్ చేస్తా...

ఇద్దరివీ ఎంజాయ్ చేస్తా...

ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి జరిగితే ఒకేసారి ఎంజాయ్ చేయడం ఉంటుంది. అయినా అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు. ఇద్దరి వివాహాలు సపరేట్ సపరేట్ గా జరుగుతాయి. వారి వివాహాల సందర్భంగా వచ్చే ఫన్, ఎగ్జైట్మెంట్ నేను మిస్ కాదలుచుకోలేదే అని నాగార్జున తెలిపారు.

ప్రేమించడ ద్వారానే..

ప్రేమించడ ద్వారానే..

నాగార్జున ముందు నుండీ తన ఇద్దరు కుమారులు వారి వారి జీవిత భాగస్వాములను(ప్రేమించడం ద్వారా) వారే ఎంచుకోవాలని చెబుతుండేవారు.

నమ్మకం లేకనే..

నమ్మకం లేకనే..

నాగార్జున అలా చెప్పడానికి కారణం అరెంజ్డ్ మ్యారేజీల మీద నాగార్జునకు పెద్దగా నమ్మకం లేక పోవడమే?

నాగ్ మొదటి వివాహం నిలవలేదు

నాగ్ మొదటి వివాహం నిలవలేదు

నాగార్జున మొదటి వివాహం రామానాయుడు కూతురు లక్ష్మితో అరేంజ్డ్ గా జరిగింది. ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు.

అమలతో హ్యాపీ

అమలతో హ్యాపీ

లక్ష్మితో విడిపోయిన తర్వాత అమలను ప్రేమ వివాహం చేసుకున్న నాగార్జున చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అందుకే తమ కుమారులు కూడా అరెంజ్డ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నాగార్జున కోరుకుంటున్నారు.

చైతు, సమంత

చైతు, సమంత

నాగ చైతన్య తన సహనటి సమంతతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. ఇరు కుటుంబాల వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పెళ్లి డేట్ ఫిక్స్ కావడమే ఆలస్యం.

అఖిల్

అఖిల్

అఖిల్ అక్కినేని తన స్నేహితురాలు శ్రేయా భూపాల్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

అఖిల్ పెళ్లి ఇప్పుడే కాదు.

అఖిల్ పెళ్లి ఇప్పుడే కాదు.


అయితే అఖిల్ వయసులో చాలా చిన్న వాడే కావడంతో... ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం డేటింగ్ ద్వారా రిలేషన్ షిప్ లోని లోటు పాట్లను తెలుసుకుంటున్నాడు అఖిల్.

త్వరలో శుభవార్త..

త్వరలో శుభవార్త..

ఈ ఏడాది చివర్లోగా నాగా చైతన్య, సమంత వివాహంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

English summary
Amidst rumours that both the Akkineni brothers get married on the same day, the doting dad Nagarjuna cleared the air in a freewheeling chitchat with a leading English news daily. Nag said that Chay and Akhil will marry on separate dates.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu