తమన్నాపై నాగార్జున హాట్ హాట్ కామెంట్స్..
హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అంటే మహిళా ప్రేక్షకులకు ఎంత ఇష్టమో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరోయిన్ నాగార్జున లాంటి గ్రీకువీరుడితో సినిమా చేయాలని ఉందని బహిరంగ ప్రకటనలు చేయడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం.
50 ఏళ్ల పైబడిన నాగార్జున వయసు పెరుగుతున్నా నవ యువకుడిలా వెలిగిపోతున్నాడు. ఆయన అందమే ఇతర హీరోలను మించిన ప్రత్యేకతను ఆయనకు తెచ్చి పెట్టింది. అందుకే ఈ తరం, ఆ తరం హీరోయిన్లనే తేడా లేకుండా నాగార్జున అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. మరి ఇంత మంది హీరోయిన్లు నాగార్జునను ఇష్ట పడుతుంటే...నాగార్జున ఏ హీరోయిన్‌ను ఇష్ట పడుతున్నారు? అనే ప్రశ్నలు రావడం సహజమే.

ఈటీవీలో ప్రసారమైన సౌందర్య లహరి కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జునకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. నటి సుహాసినితో కలిసి నాగార్జున ఈ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ తరం హీరోయిన్లలో సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నాలలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు అనే ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇస్తూ.....'అందరూ హాటే...అయితే తమన్నా హాటెస్ట్' చెప్పారు.
తమన్నాకు నాగార్జున ఫ్యామిలీతో మంచి పరిచయం ఉంది. ఆ మధ్య ఆమె నాగ చైతన్యతో కలిసి 100%లవ్, తడాఖాలో నటించింది. తడాఖా సినిమా ప్రమోషన్ల సందర్భంగా తమన్నా అంద చందాలపై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అప్పుడేదో సినిమా ప్రమోషన్స్ కోసం అలా మాట్లాడాడని అనుకున్నాం కానీ....నిజంగానే తమన్నాపై నాగార్జునకు హాట్ హాట్ అభిప్రాయం ఉందని ఇప్పుడే తెలిసింది.


Click it and Unblock the Notifications











