దడ, బెజవాడ.. చైతన్యకు గుణపాఠం : నాగ్
దడ, బెజవాడ సినిమాలు ప్లాపవ్వడం నాగచైతన్యకు గుణపాఠం నేర్పిస్తాయని, ఇలాంటి దెబ్బలు తగిలితేనే కెరీర్ లో మంచి స్థాయికి పోతారని వ్యాఖ్యానించారు నాగార్జున. రాజన్న సినిమా విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...చైతన్య ఇంకా యువకుడే, సినీరంగంలో అతనికి ఉన్న అనుభవం చాలా తక్కువ, నేను కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా ప్లాపులు ఫేస్ చేశాను. అంతెందుకు ఇటీవల నేను నటించిన కేడీ కూడా ప్లాపు. కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. అంచనాలు తప్పుతుంటాయి అని చెప్పకొచ్చారు.
బెజవాడ చాలా చెత్తగా ఉందనే విషయం చెప్పకనే చెప్పిన నాగ్.....సినిమాను వాళ్లు(నిర్మాత, దర్శకుడు, హీరో) చూసుకోకుండా జనాల మీదకు వదిలారు, సంవత్సరం అంతా కష్టపడి సినిమా విడుదల విషయంలో తెగ తొందర పడ్డారు. సినిమా ఎలా వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోకుండా సినిమాలు విడుదల చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి అన్నారు.
నాగార్జున కంటే నాగచైతన్య నటన బాగుటుందని వర్మ వ్యాఖ్యానించడంపై.....ఆయన స్పందిస్తూ వర్మ కాంట్రవర్సీలకి పెట్టింది పేరు. చైతన్య కంటే నా నటన బాగుందంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు, నాకంటే నాగచైతన్య నటన బాగుందంటే చాలా మంది ఆసక్తి చూస్తారు...ఇదంతా వర్మ పబ్లిసిటీ స్టంటు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











