'ప్రాంతీయభేధం లేదు...హైదరాబాద్ వాసినే!' స్పష్టం చేసిన నాగార్జున
రాజన్న సినిమా ఒప్పుకోవడం వెనుక వేరే ఉద్దేశ్యం లేదు..50ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. నేను హైదరాబాద్ వాసిని అన్నారు నాగార్జున. నాగార్జున ఈ సినిమా చేయటానికి కారణం తెలంగాణా తలనొప్పులు తన సినిమాలకు ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతో అని బయిట టాక్ ఉంది. ఆ విషయాన్ని దృష్ఠిలో పెట్టుకునే మీడియా వద్ద ఇలా స్పంష్టం చేసారు. ఆ విషయం మాట్లాడుతూ..రాజన్న గురించి చెప్పాలంటే స్వాతంత్య్రం రాక మునుపు జరిగే సినిమా ఇది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. నిజాం రాష్ట్రంగా ఉండేది.
ఈ సినిమా గురించి ఎవర్ని అడిగినా మంచి కథ అంటున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం, ఈ చిత్రానికి రాజమౌళి స్టంట్స్ సమకూర్చడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా గురించి విజయేంద్రప్రసాద్‌గారు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇది పీరియాడిక్ ఫిలిం. లక్కీగా వచ్చింది. అలాంటి సినిమాలో నటిస్తే నాకు కొత్త సినిమా చేసినట్లనిపిస్తుంది కాబట్టి ఒప్పుకున్నాను. ఆ సినిమా ఒప్పుకోవడం వెనుక వేరే ఉద్దేశ్యం లేదు.
ఇక రాజన్న చిత్రంలో నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటించనుంది. ఇక విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. ఇక ఈ చిత్రం కథ రజాకార్ల ఉద్యమం నేఫద్యంలో జరగుతుంది. ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు. అలాగే రాజమౌళి ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు.


Click it and Unblock the Notifications











