»   » ‘మనం’ కొత్త టీవీ ఛానల్, స్పందించిన నాగార్జున

‘మనం’ కొత్త టీవీ ఛానల్, స్పందించిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరు భాగస్వామ్యంలో నడిచిన ‘మా టీవీ' నెట్వర్క్ ఛానల్స్‌ను..... స్టార్ ఇండియా వారు భారీ ఒప్పందంతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 2000 కోట్లు ఉంటుందని అంచనా. సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న ‘మా టీవీ' నెట్వర్క్ ను ఎందుకు అమ్మేసారనేది అసలు ఎవరికీ అర్థం కాలేదు.

అయితే... అక్కినేని నాగార్జున మరో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రముఖ సినీ నిర్మాత, ఫైనాన్షియల్ ప్రసాద్ వి పొట్లూరి భాగస్వామ్యంతో కలిసి ఆయన ఈ కొత్త టీవీ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని నాగార్జున ట్విట్టర్ ద్వారా బుధవారం తెలిపారు.

నాగార్జున, కార్తి సినిమా వివరాలు...
నాగార్జున, కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 9 నుండి హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో వేసిన భారీ సెట్ లో ఈ చిత్రం కోసం నాగార్జున, కార్తీ, తమన్నా పాల్గొంటున ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. తొలి షెడ్యూల్ చెన్నైలో జరిగింది. జూన్ నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.

Nagarjuna says, 'I Am Not Starting Manam Channel'

నాగార్జున మాట్లాడుతూ..‘తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. వంశీ ఎక్స్ ట్రార్డినరీ సబ్జెక్టు చెప్పాడు. సబ్జెక్టు వినగానే వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. ఈ సబ్జెక్టుని వంశీ చాలా బాగా డీల్ చేస్తున్నాడు. పి.వి.పి చాలా పెద్ద లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్నారు.

కార్తి మాట్లాడుతూ...‘తెలుగులో నేను చేస్తున్న ఫస్ట్ స్ట్రయిట్ మూవీ ఇది. నాగార్జున గారి లాంటి పెద్ద స్టార్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా థ్రిల్ గా ఉంది. ఒకేసారి తెలుగు, తమిళ వెర్షన్స్ షూటింగ్ చెయ్యడం నాకు కొత్తగా ఎగ్జైటింగుగా ఉంది. చాలా మంచి కమర్షియల్ సినిమా ఇది ' అన్నారు.

తమన్నా మాట్లాడుతూ...‘నాగార్జున, కార్తీ లాంటి స్టార్స్ తో కలిసి ఈ సినిమా చెయ్యడం వెరీ వెరీ హ్యాపీ. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...‘మా కథకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే నాగార్జున గారు, కార్తీలతో ఇంత భారీ మల్టీస్టారర్ చెయ్యడం చాలా చాలా హ్యాపీగా ఉంది. పి.వి.పి లాంటి పెద్ద సంస్థలో చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ట అయ్యేలా అద్భుతంగా రూపొందుతోంది' అన్నారు.

English summary
Responding on the news Nag stated that he isn't starting any entertainment channel named Manam. "Absolutely they are not true. I'm not starting one", says Nag, who is currently busy shooting for Vamsi Paidipally's movie with Karthi and Tamanna at Annapurna Studios.
Please Wait while comments are loading...