twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునకు కాకతీయుల కథ కూడా చెప్పా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటించిన 'ఢమరుకం' చిత్రం నాలుగు రోజుల క్రితం విడుదలై ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. లెక్కకు మిక్కిలి సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈచిత్రం ప్రేక్షకుల సహనం నశించిన తర్వాత విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

    ఆసంగతి పక్కన పెడితే..ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆస్తికర విషయాలు వెల్లడించారు. 'తాను ఢమరుకం స్టోరీతో పాటు, వరంగల్ కింగ్స్(కాకతీయులు)కథను ఆర్ ఆర్ మూవీమేకర్స్ అధినేత వెంకట్ గారికి వివరించానని తెలిపారు.

    నాగార్జునతో సినిమా చేద్దామని నాగార్జునకు కూడా ఈ రెండు కథలు చెప్పగా... కాకతీయ కింగ్స్ స్టోరీ పక్కన పెట్టి, డమరుకం స్టోరీని నాగార్జున ఓకే చేసారని' శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. త్వరలో నాగ చైతన్యతో సినిమా చేస్తున్న మాట వాస్తవమే అని, అయితే స్క్రిప్టు ఇంకా ఫైనల్ కాలేదని, ప్రస్తుతం డమరుకం ప్రమోషన్లలో బిజీగా ఉన్నానని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

    ఢమరుకం చిత్రం వివరాల్లోకి వెళితే..
    కథ ఆటో డ్రైవర్ మల్లిఖార్జున(నాగార్జున) చుట్టూ తిరుగుతుంది. కొన్ని అతీత శక్తులు గల అమ్మాయి(అనుష్క)ని మల్లిఖార్జున ప్రేమిస్తాడు. ఆ శక్తులను వశం చేసుకోవడానికి విలన్(రవి శంకర్) ఆమెను చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఆమెను ప్రేమిస్తున్న మల్లిఖార్జున కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. మరి శివుడికి, కైలాసానికి, వీరికి ఏమిటం సంబంధం అనే విషయాలు ఆ తర్వాతి స్టోరీ.

    English summary
    "I first narrated two stories to Dr. Venkat of R.R.Movie Makers. One is based on the Warangal kings and the other is ‘Dhamarukam’. I was asked to narrate both scripts to Nagarjuna garu and after narration, he selected Dhamarukam." director Srinivas Reddy told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X