మోహన్ బాబుకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిర్మించే చిత్రంలో నటించాను...ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి..ఎందుకంటే కృష్ణార్జున సినిమాలో నాకు చక్కని పాత్రను ఇచ్చారు.... ఈ విజయవంతం కావాలని స్వార్థంతో చెబుతున్నాను..ఎందుకంటే ఈ సినిమాలో నేను కూడా నటించాను...ఈ సినిమా మల్టీ స్టారర్ చిత్రంగా ఇది నిలుస్తుంది...మిగతావారు కూడా మల్టీ స్టారర్ చిత్రాలపై దృష్టి పెట్టాలి...అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో బుధవారం సాయంత్రం కృష్ణార్జున చిత్రం ఆడియో విడుదల అయింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విష్ణు వర్థన్, మమతా మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.