అనుష్కను మోహరింపచేస్తున్న నాగార్జున
తన అందంతో అమ్మాయిల మనస్సు దోచుకునే నాగార్జున ఎంతో మంది లేడిస్ ను ఆకర్షించాడని మనకందరకు తెలుసు సీజన్ కో హీరోయిన్ ను మార్చే నాగ్ ప్రస్తుతం అనుష్క మీద కన్నెశాడు అనడంతో అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాబోయే సంవత్సరంలో అనుష్కతో సినిమాకు రెడీ అయ్యాడు మరీ.
అనుష్కను 'సూపర్" తో తెలుగు తెరకు పరిచయం చేసిన నాగార్జున తర్వాత డాన్, కింగ్, పాటలో లాగా ఆమెను వదలకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ భూమిక నిర్మిస్తున్న చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తూండగా ఆ సినిమాలో కూడా గెస్ట్ పాత్రను అనుష్క కోసం ఒప్పుకున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క కలలో నాగార్జున, అనుష్కతో రొమాన్స్ చేస్తాడట. అందుకే సీన్ చెప్పగానే నాగ్ ఓప్పుకున్నాడని సమాచారం. ఎంతైనా మన్మథుడు మంచి రసికుడు కదా! అసలే అనుష్క ఇంకెలా తట్టుకోగలడు చెప్పండి. దీని తర్వాత అనుష్కతో డైరక్ట్ హీరోగా నాగ్ కు మరో చిత్రం ఇక 'టబు", 'మమత"ల పని అవుట్ అంటున్నారు విమర్శకులు.


Click it and Unblock the Notifications











