ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు నాగార్జున పరామర్శ!
అక్కినేని నాగార్జున కొద్దిసేపటి క్రితమే నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. హరికృష్ణ, నాగార్జున కలసి సీతారామరాజు చిత్రంలో నటించారు. ఈ విషయాన్ని నాగార్జున గుర్తుచేసుకున్నారు.
ఒక నెల క్రితమే ఫోన్ చేసి మాట్లాడారు. కలసి చాలా రోజులు అవుతోంది తమ్ముడు.. ఒకసారి కలవాలి అని అన్నారు. అంతలో ఎలా జరిగిందని నాగార్జున తెలిపారు. ఆయన దూరమైన విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నానని తెలిపారు.

హరికృష్ణకు నివాళులు అర్పించిన నాగార్జున.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ని ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేసి వెళ్లారు. హరికృష్ణ అంతిమ యాత్ర మధ్యాహ్నం 3 గంటలనుంచి ప్రారంభం కానుంది.
nandamuri harikrishna death nandamuri harikrishna rip nandamuri harikrishna jr ntr news kalyan ram ntr balakrishna chandrababu tollywood janaki ram death నందమూరి హరికృష్ణ మరణం నందమూరి హరికృ


Click it and Unblock the Notifications