మహేష్ బాబు, మెగాస్టార్ చాటింగ్.. స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన నాగార్జున
మన స్టార్ హీరోల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. హీరోల మధ్య మనస్పర్థలు ఉన్నాయని రూమర్స్ చాలానే వస్తుంటాయి. కానీ మన స్టార్స్ మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ అప్పుడప్పుడు స్పెషల్ పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక రీసెంట్ నాగార్జున స్టార్ హీరోలకు సంబంధించిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

వైల్డ్ డాగ్.. అంచనాలు భారీగానే ఉన్నాయి
అక్కినేని నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్మీ ఆపరేషన్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదటి నుంచి కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తోంది.

ఓటీటీ డీల్ సెట్టయినప్పటికి..
మొదట ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థతో భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నప్పటి మళ్ళీ వెనక్కి తగ్గారు. క్రాక్, ఉప్పెన వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకోవడంతో నాగార్జున వెంటనే ఆ డీల్ ను క్యాన్సిల్ చేయించడానికి టాక్ వచ్చింది.

మహేష్ చాటింగ్..
ఇక ఇప్పుడు సినిమా కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా మహేష్ సినిమాకు సంబంధించిన టీజర్ ను చూసి టెర్రిఫిక్ గా ఉందని నాగార్జునకు పర్సనల్ గా మెస్సేజ్ చేశాడు. అయితే ఈ స్క్రీన్ షాట్ ను ట్రైలర్ రిలీజ్ చేసే ముందు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చా అని అడగడంతో.. మహేష్ కూడా హ్యాపీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మెగాస్టార్ చేతులమీదుగా..
ఇక మెగాస్టార్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని స్వయంగా వైల్డ్ డాగ్ ట్రైలర్ ను మెచ్చుకొని లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన చాటింగ్ స్క్రీన్ షాట్ ను కూడా నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సాయంత్రం 4:05కు సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. మొత్తానికి నాగార్జున వైల్డ్ డాగ్ ను స్టార్స్ తో బాగానే ప్రమోట్ చేయిస్తున్నారు. మరి ఏప్రిల్ 2న రానున్న ఈ సినిమా అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











