నాన్న గారితో నా చివరి ఫొటో ఇది: నాగార్జున (ఫొటో)
హైదరాబాద్: నాగార్జున కి తన తండ్రితో చాలా ఎమోషనల్ ఎటాచ్ మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆ విషయం గుర్తు చేసేలా ఓ ఫోటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పెట్టి, ఇది తన తండ్రితో దిగిన ఫొటో అని చెప్పారు. ఈ విషయం ట్వీట్ చేస్తూ...నేను మనం సినిమా ఫొటోలు చూస్తూంటే ఇది నాన్న తో దిగిన చివరి ఫోటో అని అర్దమైంది అన్నారు. అన్నపూర్ణ స్టూడియాస్ పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం గురించి నిర్మాత నాగార్జున మాట్లాడుతూ..' నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావుగారొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.
నాగార్జున మాట్లాడుతూ... ఇప్పటికే 'మనం' చిత్రం వీక్షించానని, అద్బుతంగా రూపొందించబడిందన్నారు. ఈ చిత్రంలో తమ ముగ్గురి మధ్య సరదా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సినిమా వినోదం పండిస్తుందనీ, చక్కని మ్యూజిక్ కుడా ఉందనీ అన్నారు. ఇందులో నాన్న నటన చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. సినిమాలో నటిస్తూనే పరమపదించడంతో ఆయన చిరకాల కోరిక నెరవేరిందన్నారు.
ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











