నాగార్జున ‘షిరిడి సాయి’ ఆడియో జూన్ 2న
కింగ్ నాగార్జున ప్రస్తుతం 'షిరిడి సాయి' అనే ఆధ్యాత్మిక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను జూన్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మే 27న ఈచిత్రం షూటింగ్ పూర్తి కానుంది. అనంతరం షిరిడిలో గుమ్మడియ బద్దలు కొట్టే కార్యక్రమం చేపట్టి బాబా పాదాల సినిమా రీల్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈచిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసే యోచనలో ఉన్నారు. నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం ఇంకా విడుదల కాక పోవడం వల్ల ఈచిత్రాన్ని కూడా ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'షిరిడి సాయి' చిత్రంపై కూడా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున షిరిడి సాయి గెటప్ అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథ సమకూర్చగా.... సాయికృపా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా వేద వ్యాస్, చంద్రబోస్ లిరిక్ రైటర్స్‌గా పని చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటల అందిస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం.


Click it and Unblock the Notifications











