నాగ్ ‘షిరిడి సాయి’ విడుదల విశేషాలు
నాగార్జున షిరిడి సాయి బాబా పాత్రలో 'షిరిడి సాయి" చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని జులై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెలలో ఆడియో విడుదల చేసి అనంతరం నెల రోజుల గ్యాప్‌లో విడుదల చేసేందు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం కర్నాటకలో షూటింగ్ జరుపుకుంటోంది. మార్చిన 12వరకు ఇక్కడే షూటింగ్ జరుపుకోనుంది. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా 7 ఎకరాల్లో వేసిన మసీదు సెట్ లో షూటింగ్ జరుపనున్నారు.
ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు బెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.ఈ నేపథ్యంలో షిరిడి సాయి ఆడియోపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తి రస చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. షిరిడి సాయి కూడా అదే రేంజ్ లో ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.
దీనికి తోడు నాగార్జున షిరిడి సాయి గెటప్ కూడా రియల్ గా, అద్భుతంగా ఉండటంతో అభిమానుల్లో కూడా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలై ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











