నాగ్ ‘షిరిడి సాయి’ విడుదల తేదీ ఖరారు
అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం 'షిరిడి సాయి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 5న ఈచిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. మరో వైపు ఈచిత్రం ఆడియోను జూన్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. జూన్ చివరికల్లా చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఇప్పటికే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ భక్తిరస చిత్రాలు వచ్చాయి. 'షిరిడి సాయి' వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా.
ఈ చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథ సమకూర్చగా.... సాయికృపా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా వేద వ్యాస్, చంద్రబోస్ లిరిక్ రైటర్స్. పరుచూరి బ్రదర్స్ మాటల అందిస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం.
మరో వైపు నాగార్జున నటించిన తాజా చిత్రం 'డమరుకం' జులై నెలలో విడుదలకు సిద్దం అవుతోంది. ఈచిత్రానికి షిరిడి సాయి పోటీ కాకూడదనే కారణంతో సెప్టెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా...రూ. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన డమరుకం చిత్రానికి బయ్యర్లు దొరకడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ ఖర్చు చేశారు కాబట్టి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎక్కవ రేటుకే బేరానికి పెట్టింది. అయితే నాగార్జునకు ఉన్న మార్కెట్‌కు....నిర్మాతలు చెబుతున్న రేటుకు కుదరక పోవడంతో బయ్యర్లు సినిమాను కోనడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











