twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిబ్రవరి 1 నుంచి నాగార్జున తెల్ల జుట్టుతో..

    By Srikanya
    |

    Nagarjuna
    నాగార్జున,రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం షిర్డీ సాయిబాబా. ఈ చిత్రం పిబ్రవరి 1 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం నిమిత్తం నాగార్జున గెటప్ ఛేంజ్ చెయ్యనున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..ఇప్పటివరకు నన్ను ఒకతరహాలో చూశారు. ఇక మీదట జుట్టుకు తెల్లటి రంగు వేసుకోవాలి. ఎందుకంటే.. షిరీడీ సాయిబాబాగా కన్పించబోతున్నా.దానికోసం గడ్డెంతోపాటు జుట్టు కూడా పెంచాలి అన్నారు నాగార్జున. ఈ చిత్రం నిమిత్తం ఆ మధ్యన షిర్డీలో మ్యూజిక్ సిట్టింగ్ జరిపారు. ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రసాద్ కలర్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారు.

    పాటలు పూర్తిగా తృప్తికరంగా వచ్చేకే మిగతా పనుల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయాలని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున చేయబోయే బాబా పాత్రకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు.పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

    English summary
    Nagarjuna's new devotional film on Shirdi Sai Baba is likely to start rolling from February 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X