శ్రీ జగద్గురు ఆది శంకర : నాగార్జున షాకింగ్ గెటప్

By Bojja Kumar

హైదరాబాద్ : దర్శకేంద్రుడి దర్శకత్వంలో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాలు చేసిన అక్కినేని నాగార్జున సుప్రసిద్ధ రచయిత జె.కె. భారవి దర్శకత్వంలో పురడు పోసుకుంటున్న 'జగద్గురు ఆది శంకర"లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నాగార్జున గెటప్ కు సంబంధించిన షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. ఇందులో నాగార్జున్ నల్ల డ్రెస్ లో సరికొత్తగా కనిపించారు.

Nagarjuna in Jagadguru Aadi Shankara

ఈ చిత్రానికి జెకె భారవి దర్శకత్వం అయినప్పటికీ....నాగార్జున ఎపిసోడ్‌కు మాత్రం రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ షూటింగ్ హైదరాబాద్ లో జరింది. ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

ఇందులో ఆదిశంకర పాత్రలో కౌషిక్ బాబు నటిస్తుండగా, ఇతర పాత్రల్లో రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X