నాగార్జున 'సీక్రెట్' వ్యవహారం!!

నాగార్జున కింగ్ షూటింగ్ పేరుతో గత కొద్ది రోజులుగా బెంగుళూరులో ఉంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈ యాడ్స్ షూట్ చేసారని చెప్తున్నారు. అంతేగాక ఈ యాడ్స్ కోసం జరిగిన టాక్స్,ఎగ్రిమెంట్ చాలా సీక్రెట్ మెయింటైన్ చేసి దెబ్బకొట్టారంటున్నారు. ఇక బెంగుళూరుపై వై.యస్ జగన్ కి ఉన్న గ్రిప్ అందరికీ తెలిసిందే. దాంతోనే ఇది సాధ్యమయిందని చెప్తున్నారు. ఇక ఇలా ఇంకెంతమంది సినిమావాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు సీక్రెట్ గా లాగి ట్వీస్ట్ ఇవ్వనున్నారో అని అంతా చెప్పుకుంటున్నారు. అందులోనూ ధర్మవరపు సుబ్రమణ్యం మరో ప్రక్క నాగార్జున ని సమర్ధిస్తూ...మరింత మంది సినిమా వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటూ సిగ్నల్స్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











