పాత చొక్కాతో నాగ్ పబ్లిక్ ఎంట్రీ-అంతా షాక్
టాలీవుడ్ మన్మధుడుగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నాగార్జునతో స్టైల్ విషయంలో ఏ హీరో కూడా పోటీకి రాలేడు. ఈ విషయంలో నాగ్ చాలా కేర్ తీసుకుంటారు. ఒకసారి వేసుకున్న షర్ట్ మళ్లీ వేసుకునే అలవాటే లేదు నాగార్జునకి. ఇప్పటి వరకు నాగార్జున ఎన్ని షర్ట్స్ కొన్నాడో లెక్కే లేదు. అందుకే నాగ్ వేసే దుస్తులపై చాలా మంది దృష్టి పెడుతుంటారు. ఆయన స్టైల్ ను పాలో అవుతూ ఉంటారు.
అయితే వయసు పై బడుతున్న నేపథ్యంలో స్టైల్ విషయంలో నాగార్జున శ్రద్ధ తగ్గినట్లే కనిపిస్తుంది. ఇటీవల ఓ పుస్తకం విడుదల కార్య్రకమానికి హాజరైన ఆయన...పాత షర్ట్‌తో వచ్చాడు. గతంలో 'తకిట తకిట" ప్రీమియర్ షోకు వేసుకొచ్చిన షర్ట్‌నే మళ్లీ వేసుకొచ్చారు. ఈ సీన్ చూసి అంతా షాక్ అయ్యారు. నాగార్జున ఏమిటి? పాత షర్టునే మళ్లీ వేయడం ఏమిటని? అని బిత్తర పోయారు. డబ్బులు మిగుల్చు కోవడానికే నాగార్జున ఇలా చేశారని ఇలా అంటే...వయసు పైబడుతున్న నాగ్ సింప్లిసిటీకి అవాటు పడుతున్నారని మరికొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











