రెండు బీర్లు తాగాను, ఫ్యాన్స్ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నా: నాగార్జున

"నా ఫ్యాన్స్ రాజుగారి గది-2 సినిమా సక్సెస్ తో చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ఆనందం కనిపించింది.

తన వ్యక్తిగత ఆనందాలను, సంతోషాలను, బాధలను కూడా మీడియా మాధ్యమంగా అభిమానులతో పంచుకొంటూ ఉంటాడు నాగ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున ఫుల్ ఖుషీగా ఉన్న సమయం ఇది. ఒకవైపు తనయుడి పెళ్లి ఘనంగా జరిగింది. మరోవైపు 'రాజుగారి గది-2' రూపంలో మంచి హిట్ కూడా లభించింది.

 నాగార్జున కెరీర్ లో తొలిసారి

నాగార్జున కెరీర్ లో తొలిసారి

రాజుగారి గది సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఓంకార్ రెండో పార్ట్ ను భారీ స్టార్ కాస్టింగ్ తో తీశాడు. హీరో నాగార్జున కెరీర్ లో తొలిసారి హర్రర్ కామెడీ జోనర్ లో నటించాడు. ‘‘రాజుగారిగది-2 సినిమా బాగుందనే టాక్ అన్నివైపుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా నా ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ తో చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ఆనందం కనిపించింది. రెండు బీర్లు తాగి.. బిర్యానీ తిని వాళ్ల సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నా'' అంటూ తాజాగా సినిమా సక్సెస్ మీట్ లో నాగ్ చెప్పాడు.

రీ షూట్లకు వెళ్లాల్సి వచ్చింది

రీ షూట్లకు వెళ్లాల్సి వచ్చింది

రాజుగారి గది-2 సినిమా అవుట్ పుట్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో నాగార్జున ఒకానొక టైంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట. దాంతో రీ షూట్లకు వెళ్లాల్సి వచ్చింది. ఓంకార్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రయిలర్ కూడా నచ్చలేదనే విషయం బహిరంగంగానే చెప్పాడు.

 విడుదలకు ముందే

విడుదలకు ముందే

దానికితోడు ఓవర్సీస్ లో సినిమా ప్రమోషన్ చేసే ప్రయత్నమే చేయలేదు. కానీ రాజుగారి గది-2 ప్రేక్షకులను ఆకట్టుకుండటంతో సెలబ్రేషన్ అనే మాటతో తనలోని సందేహాలన్నీ తీరిపోయాయని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా విడుదలకు ముందే.. ప్రీ రిలీజ్ మార్కెట్ తో లాభాలను తెచ్చిపెట్టింది.

 కలక్షన్లే అందుకు సాక్ష్యం

కలక్షన్లే అందుకు సాక్ష్యం

ఇక విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తొలి రోజున ఐదు కోట్ల రూపాయల వసూళ్లను సాధించగా.. రెండో రోజు కూడా అదే ధాటి కొనసాగిందని తెలుస్తోంది. రెండో రోజుకే ఈ సినిమా కలెక్షన్లు పది కోట్ల మార్కును దాటాయని సమాచారం. దీంతో బయ్యర్లకు లాభాలు పంచే దిశగా ఈ సినిమా సాగుతోందని చెప్పవచ్చు. కాని ట్రేడ్ వర్గాలు మాత్రం.. ఇక్కడ ఇండియాలో సినిమా ఓకేగా సాగుతున్నా కూడా.. అమెరికాలో మాత్రం పెద్దగా ఎక్కడం లేదు అంటున్నారు. కలక్షన్లే అందుకు సాక్ష్యం అంటూ చెబుతున్నారు. అది సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X