తాగి డ్రైవ్ చేసిన కేసులో దొరికిన అఖిల్
ఫార్ములా వన్ రేసర్ అఖిల్ తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. మధ్యం సేవించి కారు నడుపుతూ సికింద్రాబాదులో జేబీఎస్ వైపుగా వెలుతుండగా గమనించి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన అతనిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అతనికి భారీ జరిమాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అఖిల్ నాగార్జున తనయుడు అని కొన్ని టీవీ ఛానల్స్ లో వార్తలు వస్తుండగా, మరికొన్ని ఛానల్స్ లో మాత్రం ఫార్ములా వన్ రేసర్ అని చెబుతున్నారు. ఇంకా ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
సినీ నటుడు నిఖిల్ ఇటీవల పోలీసులకు మధ్య సేవించి పట్టుబడగా... భారీ జరిమానా విధించడంతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ విధించిన విషయం తెలిసిందే. గతంలోనూ అనేక మంది స్టార్స్ మద్యం సేవించి పట్టుబడ్డారు. అయితే బుడ్డోడైన నాగార్జున కొడుకు ఇంత చిన్న వయసులో మద్యం సేవించడం ఏమిటి? ఇలా తాగి డ్రైవ్ చేయడం ఏమిటి? అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











