నాగార్జున ‘బోడి గుండు’ వెనక అసలు స్టోరీ..!

దేవుడి సినిమా ప్రారంభించే ముందు దైవ దర్శనం చేసుకోవాలనే ఆలోచన, గతంలో శ్రీవారికి పెండింగులో ఉన్న మొక్కలు తీర్చుకోవడంతో పాటు... సాయిబాబా పాత్రకు జుట్టు అవసరం లేదు, గుండు చేయించుకోవడం ద్వారా అందరి దృష్టి తనపై పడటంతో పాటు, తను చేయబోయే షిర్టీ సాయిబాబా సినిమాపై కూడా మంచి ఇంప్రెషన్ పడుతుందని, ఎంతో పవిత్రంగా తాను సాయిబాబా పాత్ర చేయబోతున్నాననే విషయాన్ని అభిమానులకు పరోక్షంగా చెప్పొచ్చు. ఇన్ని కారణాలు దాగి ఉన్నాయి నాగార్జున బోడి గుండు వెనక.
అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో తనకు మాత్రమే పరిమితం అయిన స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగార్జున చేయబోయే బాబా పాత్రకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది. ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











