దాసరికి స్పెషల్ థ్యాంక్స్: డమరుకంపై నాగార్జున

By Pratap

హైదరాబాద్: నాగార్జున హీరోగా నటించిన ఢమరుకం సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఢమరుకం ఈ నెల 23వ తేదీన విడుదల అవుతుందని హీరో నాగార్జున బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. డమరుకం సినిమా మీద దాని బరువే కాకుండా, ఇతర సినిమాల బరువు కూడా పడిందని, తన, తన కుటుంబ సభ్యుల భారం కూడా పడిందని ఆయన అన్నారు. డమరుకాన్ని డమరుకం లాగా విడుదల చేసి ఉంటే, ఎప్పుడో విడుదలై ఉండేదని ఆయన అన్నారు.

బరువును దించడానికి చాలా మంది సాయపడ్డారని ఆయన చెప్పారు. ఈ విషయంలో దాసరి నారాయణ రావు తీసుకున్న శ్రద్ధ చాలా ప్రత్యేకమైందని, దాసరికి తాను ప్రత్యేకంగా కృతజ్ఝతలు చెబుతున్నానని ఆయన అన్నారు. అయితే డమరుకం వచ్చిన కష్టాలకు తాను ఇబ్బందిగా ఫీల్ కాలేదని చెప్పారు. ఈ సినిమా తనకు సహనాన్ని, ఓర్పును నేర్పిందని అన్నారు. మనుషుల మీద నమ్మకం పెరిగిందని, సినిమా ఇండస్ట్రీ మీద విశ్వాసం పెరిగిందని అన్నారు. దాసరి తన భుజాల మీద వేసుకుని సినిమా విడుదలకు సహాయ పడ్డారని చెప్పారు.

సినిమా విడుదలకు ఓ చేయి వేసిన శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఝతలు చెబుతున్నానని ఆనయ అన్నారు. బయ్యర్ల గిరాకీ పెరిగిందని, ముగ్గురేసి బయ్యర్లు సినిమాను తీసుకోవడానికి రెడీగా ఉన్నారని ఆయన చెప్పారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదల వాయిదా పడడంతో తన అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, తన 26 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు.

శ్రీనివాస రెడ్డి సినిమాను గొప్పగా తీశారని ఆయన అన్నారు. ఆర్ఆర్ వెంకట్‌కి ఈ సందర్భంగా కృతజ్ఝతలు చెప్పాలని ఆయన అన్నారు. డమరుకం వంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలని, అటువంటి ధైర్యం వెంకట్ చేశారని నాగార్జున అన్నారు. వెంకట్ తనతో మళ్లీ సినిమా తీస్తానంటే తాను రెడీ ఉన్నానని ఆయన చెప్పారు. సినిమా విడుదలకు ఇన్ని సమస్యలున్నాయని తనకు చాలా రోజుల వరకు తెలియదని చెప్పారు. డమరుకం సినిమా విడుదల వాయిదాపై తనకు ఎవరి మీద కూడా ఫిర్యాదులు లేవని, దీన్ని అవకాశంగా తీసుకుని ఎవరో డబ్బులు చేసుకున్నారని కూడా తాను అనుకోవడం లేదని చెప్పారు.

తాను క్యాషియర్‌ను కాదని, ఎవరైనా అలా అంటే వ్యతిరేకిస్తానని, తన నిర్మాతకు తాను క్యాషియర్‌గా వ్యవహరించడం తన ఒంటికి పడదని ఆయన అన్నారు. వేరే బరువు పడకుండా ఉంటే డమరుకం విడుదలకు ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. డమరుకం కొత్త రకం సినిమా అని, తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఎవరి సినిమా ఆగినా నీ సినిమా ఆగకూడదని ప్రకాష్ రాజ్ అన్నారని, ప్రకాష్ రాజ్‌కు కృతజ్ఝతలు చెబుతున్నానని నాగార్జున అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X