twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లిప్‌లాక్ ముద్దు సీన్లు చేయడంలో ఆరితేరిపోయా: రిపోర్టర్‌కు నాగార్జున పంచ్

    |

    నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం మ‌న్మ‌థుడు 2. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మన్మధుడిగా నాగార్జున ఈ చిత్రంలో తన రొమాంటిక్ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో లిప్ లాక్ సీన్లలో మునిగి తేలాడు. ఈ సందర్భంగా నాగార్జున లిప్ సీన్లపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

    నా కోడలు సమంతను మరింత జాగ్రత్తగా చూసుకున్నా

    నా కోడలు సమంతను మరింత జాగ్రత్తగా చూసుకున్నా

    సమంతతో ఇంతకు ముందు మనం, రాజుగారి గది 2 చేశా. సమంతతో చేయడం ఆల్వేస్ హ్యాపీ. కోడలైన తర్వాత మరింత ప్రొటెక్టివ్ ఉండాల్సి వచ్చింది. షూటింగులో జాగ్రత్తగా చూసుకుని, జాగ్రత్తగా ఇంటికి పంపించడం లాంటివి జరిగాయని నాగార్జున తెలిపారు.

    ఇది సీక్వెల్ కాదు

    ఇది సీక్వెల్ కాదు

    17 సంవత్సరాల క్రితం వచ్చిన మన్మధుడు చిత్రానికి, ఇపుడు వచ్చిన మన్మధుడు 2కు ఎలాంటి సంబంధం ఉండదు. క్యారెక్టర్లు కానీ, ఇతర అంశాల విషయంలో కానీ ఎలాంటి పోలిక ఉండదు. సేమ్ రొమాంటిక్ కామెడీ జోనర్ కాబట్టి ఈ టైటిల్ వాడుకున్నాం. అందులో, ఇందులో నేనే లీడ్ స్టార్ కాబట్టి ఆ టైటిల్ వాడుకోవడం ఈజీ అయిపోయిందని నాగ్ వెల్లడించారు.

    లిప్‌లాక్ ముద్దు సీన్లు చేయడంలో ఆరితేరిపోయా

    లిప్‌లాక్ ముద్దు సీన్లు చేయడంలో ఆరితేరిపోయా

    లిప్ లాక్స్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడగ్గా... మీరు గీతాంజలి సినిమా చూశారా? అందులో రెండున్నర నిమిషాలు లిప్ లాక్ సీన్ చేశాను అని సమాధానం ఇచ్చారు నాగ్. అప్పటికీ ఇప్పటికీ మీ ఏజ్ చాలా మారింది కదా అంటే... ఇపుడు ప్రాక్టీస్ కూడా బాగా అయింది అంటూ పంచ్ వేశాడు నాగ్.

    ఈ సినిమా కాపీ కొట్టలేదు, ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా

    ఈ సినిమా కాపీ కొట్టలేదు, ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా

    ఈ సినిమాను మేము ఎక్కడో కాపీ కొట్టాం అనే టాక్ వచ్చింది. ‘ఊపిరి' అనేది అన్ టచబుల్ అనే ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా తీశాం. రైట్స్ కొనుక్కున్నాం. మన్మధుడు 2 సినిమా స్క్రిప్ట్ కేవా మూవీస్ నుంచి గీత నాకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చింది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ నుంచి రాసిన స్క్రిప్ట్. ఇది మీరు చేస్తే బావుంటుంది అన్నారు. నాకు నచ్చింది. సినిమా చేయడానికి ముందే స్టూడియో కెనాల్‌కి లెటర్ పంపాం. మాకు మీ సినిమా నచ్చింది. ఎంతకు ఇస్తారు రైట్స్ అని అడిగాం. వారు ఒప్పుకున్న తర్వాతే కథ మీద చర్చలు మొదలయ్యాయి. రాహుల్ బ్రహ్మాండంగా ఈ సినిమా చేశాడు... అని నాగార్జున తెలిపారు.

    English summary
    Nagarjuna speech about Manmadhudu 2 Theatrical Trailer launch. 'Manmadhudu 2' starring Nagarjuna Akkineni and Rakul Preet Singh in the lead roles, Written and directed by Rahul Ravindran, the introduction teaser of Rakul Preet as Avantika got a tremendous response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X