For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ఏమి చెప్పలేను.. కడుపు నిండిన ఫీలింగ్!, రాంచరణ్-అఖిల్ అలా పిలుచుకుంటారు: నాగార్జున

    |
    రాంచరణ్-అఖిల్ అలా పిలుచుకుంటారు !

    మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా అద్భుతంగా ఉందంటూ చిరంజీవి ప్రశంసించడంతో 'హలో'పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

    బజ్ రీత్యా ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదనే టాక్ ఉంది. ఈవెంట్ విషయానికొస్తే.. చిరంజీవి తర్వాత నాగార్జున స్పీచ్ హైలైట్ గా నిలిచింది. అలాగే నాగ చైతన్య, సమంత కూడా తమ స్పీచులతో ఆకట్టుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

     నాగార్జున ఏమన్నారంటే!:

    నాగార్జున ఏమన్నారంటే!:

    హలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం చిరంజీవి ఇంటికెళ్లి ఆహ్వానించినట్లు నాగార్జున తెలిపారు. అఖిల్‌ని ఆశీర్వదించాలని తాను కోరగానే.. అందుకు తాను సిద్దమని, ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పాలని చిరంజీవి చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా చూశాకే ప్రీ-రిలీజ్ వేడుకకు రావాలని చిరంజీవిని కోరినట్లు నాగార్జున తెలిపారు.

     అన్నా.. తమ్ముడు అని పిలుచుకుంటున్నారు

    అన్నా.. తమ్ముడు అని పిలుచుకుంటున్నారు

    చిరంజీవి ఆశీర్వాదాలు తమకు ఎప్పుడూ ఉన్నాయన్నారు. వయసులో ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నా.. తనకూ చిరంజీవికి మధ్య మంచి స్నేహం ఉందన్నారు. అదే స్నేహం రామ్‌చరణ్‌-అఖిల్‌ మధ్య కూడా ఉందన్నారు. ఇద్దరూ అన్నయ్య, తమ్ముడు పిలుచుకొంటుంటే ఆనందంగా ఉందన్నారు.

     కడుపు నిండుతోంది:

    కడుపు నిండుతోంది:

    హలో సినిమా ఎంత ఆడుతుందనేది ఏమీ చెప్పలేనని అన్నారు నాగార్జున. అఖిల్‌ పాడటం, ఆడటం చూస్తుంటే మాత్రం కడుపు నిండుతోందన్నారు. హీరోయిన్ కల్యాణికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌తో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. 'మనం' తర్వాత మరో మంచి చిత్రాన్ని తమకు అందించారని అన్నారు.

     సంతోషంగా ఇంటికెళ్లా: నాగచైతన్య

    సంతోషంగా ఇంటికెళ్లా: నాగచైతన్య

    'చిరంజీవి గారు ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. హలో వేడుకకి ఆయన రావడం ఆనందంగా ఉంది. అఖిల్‌ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. కానీ తనను ఓ అందమైన ఫీల్‌గుడ్‌ సినిమాలో చూడాలనిపించేది. హలో సినిమాలో తనని చూశాక సంతోషంగా ఇంటికెళ్లా. ఈ సినిమాతో నటుడిగా అఖిల్‌ ఏంటో తెలుస్తుంది.'-నాగచైతన్య.

     అఖిల్‌ అదృష్టవంతుడు: సమంత

    అఖిల్‌ అదృష్టవంతుడు: సమంత

    'హలో సినిమా టీజర్‌, ట్రైలర్లలో అఖిల్‌ను చూస్తుంటే.. నిజమైన అఖిల్ కనిపిస్తున్నాడు. ఇదే నాకు తెలిసిన అఖిల్‌. నాన్న అందం, నాన్న స్టైల్‌, అమ్మ గ్రేస్‌ తనలో ఉన్నాయి,అదృష్టవంతుడు. ఇక విక్రమ్‌ నాకు బాగా ఇష్టమైన దర్శకుడు. ఒక అభిమానిగా ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నా. హీరోయిన్ కల్యాణి చాలా అందంగా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ మరోసారి మేజిక్‌ చేస్తాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌కి మరో పెద్ద విజయం వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా'-సమంత

     హీరోయిన్ కల్యాణి:

    హీరోయిన్ కల్యాణి:

    'మీరు చాలా ప్రేమకథలు చూశారు.. చూస్తుంటారు. మా సినిమా కూడా అలాంటి ఓ ప్రేమకథ. సినిమా చూశాక ప్రతి ఒక్కరు తమ ప్రేమ కథలు గుర్తు తెచ్చుకొంటారు'-కల్యాణి

    English summary
    After watching Akhil's performance in HELLO movie it's a feel like ate full meal said Akkineni Nagarjuna in pre release event.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more