Don't Miss!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఏమి చెప్పలేను.. కడుపు నిండిన ఫీలింగ్!, రాంచరణ్-అఖిల్ అలా పిలుచుకుంటారు: నాగార్జున
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా అద్భుతంగా ఉందంటూ చిరంజీవి ప్రశంసించడంతో 'హలో'పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
బజ్ రీత్యా ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదనే టాక్ ఉంది. ఈవెంట్ విషయానికొస్తే.. చిరంజీవి తర్వాత నాగార్జున స్పీచ్ హైలైట్ గా నిలిచింది. అలాగే నాగ చైతన్య, సమంత కూడా తమ స్పీచులతో ఆకట్టుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
నాగార్జున ఏమన్నారంటే!:
హలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం చిరంజీవి ఇంటికెళ్లి ఆహ్వానించినట్లు నాగార్జున తెలిపారు. అఖిల్‌ని ఆశీర్వదించాలని తాను కోరగానే.. అందుకు తాను సిద్దమని, ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పాలని చిరంజీవి చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా చూశాకే ప్రీ-రిలీజ్ వేడుకకు రావాలని చిరంజీవిని కోరినట్లు నాగార్జున తెలిపారు.
అన్నా.. తమ్ముడు అని పిలుచుకుంటున్నారు
చిరంజీవి ఆశీర్వాదాలు తమకు ఎప్పుడూ ఉన్నాయన్నారు. వయసులో ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నా.. తనకూ చిరంజీవికి మధ్య మంచి స్నేహం ఉందన్నారు. అదే స్నేహం రామ్‌చరణ్-అఖిల్ మధ్య కూడా ఉందన్నారు. ఇద్దరూ అన్నయ్య, తమ్ముడు పిలుచుకొంటుంటే ఆనందంగా ఉందన్నారు.
కడుపు నిండుతోంది:
హలో సినిమా ఎంత ఆడుతుందనేది ఏమీ చెప్పలేనని అన్నారు నాగార్జున. అఖిల్ పాడటం, ఆడటం చూస్తుంటే మాత్రం కడుపు నిండుతోందన్నారు. హీరోయిన్ కల్యాణికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. విక్రమ్ కె.కుమార్‌తో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. 'మనం' తర్వాత మరో మంచి చిత్రాన్ని తమకు అందించారని అన్నారు.
సంతోషంగా ఇంటికెళ్లా: నాగచైతన్య
'చిరంజీవి గారు ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. హలో వేడుకకి ఆయన రావడం ఆనందంగా ఉంది. అఖిల్ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. కానీ తనను ఓ అందమైన ఫీల్‌గుడ్ సినిమాలో చూడాలనిపించేది. హలో సినిమాలో తనని చూశాక సంతోషంగా ఇంటికెళ్లా. ఈ సినిమాతో నటుడిగా అఖిల్ ఏంటో తెలుస్తుంది.'-నాగచైతన్య.
అఖిల్ అదృష్టవంతుడు: సమంత
'హలో సినిమా టీజర్, ట్రైలర్లలో అఖిల్‌ను చూస్తుంటే.. నిజమైన అఖిల్ కనిపిస్తున్నాడు. ఇదే నాకు తెలిసిన అఖిల్. నాన్న అందం, నాన్న స్టైల్, అమ్మ గ్రేస్ తనలో ఉన్నాయి,అదృష్టవంతుడు. ఇక విక్రమ్ నాకు బాగా ఇష్టమైన దర్శకుడు. ఒక అభిమానిగా ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నా. హీరోయిన్ కల్యాణి చాలా అందంగా ఉంది. అనూప్ రూబెన్స్ మరోసారి మేజిక్ చేస్తాడు. అన్నపూర్ణ స్టూడియోస్కి మరో పెద్ద విజయం వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా'-సమంత
హీరోయిన్ కల్యాణి:
'మీరు చాలా ప్రేమకథలు చూశారు.. చూస్తుంటారు. మా సినిమా కూడా అలాంటి ఓ ప్రేమకథ. సినిమా చూశాక ప్రతి ఒక్కరు తమ ప్రేమ కథలు గుర్తు తెచ్చుకొంటారు'-కల్యాణి