మహానటి ఆడియో లాంచ్: 8 నెలల పిల్లాడిని, సావిత్రి గారు నన్ను ఎత్తుకున్నారు.. నాగార్జున!
భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.
అతిధిగా విచ్చేసిన నాగార్జున మాట్లాడుతూ.. ఏఎన్నార్, ఎన్టీఆర్, సావిత్రి ఈ మూడు పేరులు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతాయని నాగార్జున అన్నారు. వీళ్ళు లేకుండా మాయాబజార్ చిత్రం లేదు. మరెన్నో గొప్ప చిత్రాలు లేవు. ఈ సమయంలో ఞాణగ్గిరిని మిస్సవుతున్నా. సావిత్రి గారు, నాన్నగారు నటించిన చిత్రాల్లో మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి , మిస్సమ్మ వంటి చిత్రాలు నాకు చాలా ఇష్టం.

8 నెలల పిల్లాడిగా ఉన్న సమయంలో సావిత్రిగారు నన్ను ఎత్తుకుని వెలుగు నీడలు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసారని నాగార్జున అన్నారు. బహుశా ఆమె చేతి చలవవలనేనెనో నేనుకూడా ఓ స్టార్ కాగలిగా. ఒక మహిళపై తెలుగులో వస్తున్న తొలి బయోపిక్ చిత్రం ఇదే అని నాగార్జున అన్నారు. ఈ చిత్రానికి 20 మంది ఆడపిల్లలు పనిచేశారని విన్నానని చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు. ఈ చిత్రంలో నా కోడలు సమంత, నాగచైతన్య నటిస్తున్నారు. ఇంకా చాలా మంది నటిస్తున్నారు. వారందరిని చూస్తుంటే అసూయగా ఉందని నాగార్జున అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఇప్పటివరకు అశ్వినీదత్ అనేక చిత్రాలు చేసారు. మహానటి చిత్రం వైజయంతి మూవీస్ కి గౌరవాన్ని తీసుకుని వస్తుందని నాగార్జున అన్నారు. ఇప్పటివరకు విడువులైన పాటలు, టీజర్ చూస్తుంటే చాలా మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉందని నాగార్జున అన్నారు.


Click it and Unblock the Notifications











