twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐబీఎల్ టీంతో నాగార్జున పుట్టినరోజు సెబ్రేషన్స్(పిక్చర్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆగస్టు 29తో 54వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సారి నాగార్జున పుట్టిన రోజు వేడుకలను తన ఐబీఎల్(ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్) టీం 'ముంబై మాస్టర్స్'తో కలిపి జరుపుకోనున్నారు.

    'ముంబై మాస్టర్స్' టీం ఓనర్లలో నాగార్జున ఒకరు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌, బిజినెస్‌మేన్ వి చాముండేశ్వరినాథ్, నాగార్జున కలిసి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో 'ముంబై మాస్టర్స్' టీంను కొనుగోలు చేసారు. నాగార్జున పుట్టినరోజునాడే వీరి టీం సెమీ ఫైనల్స్‌లో తలపడబోతోంది.

    'నా పుట్టినరోజు నాడే మా టీం బెంగుళూరులో జరిగే సెమీఫైనల్స్‌లో తలపడబోతోంది. జట్టుకు సపోర్టుగా ఉండేందుకు నేను ఇక్కడ ఉంటాను. వారితోనే బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు వేడుక జరుపుకుంటాను' అని ఆయన వెల్లడించారు.

    నాగార్జున

    నాగార్జున


    నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల కుమారుడు. ఆగస్టు 29, 1959లో జన్మించారు. తెలుగు సినిమా రంగంలో నాగార్జున మన్మధుడిగా పేరు తెచ్చుకున్నారు.

    విద్యాభాసం

    విద్యాభాసం


    నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత మిచిగన్ విశ్వ విద్యాలయంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించాడు.

    సినిమాలు

    సినిమాలు


    నాగార్జున మొదటి చిత్రం విక్రం, మే 23, 1986లో విడుదల అయింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కధానాయకుల సరసన నిలబెట్టాయి.

    అమల, నాగ చైతన్య

    అమల, నాగ చైతన్య


    ఐబీఎల్ టోర్నీలో తమ టీంకు సపోర్టుగా నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య, ఆయన భార్య అక్కినేని అమల. నాగార్జునతో పాటు వీరు కూడా ఐబీఎల్ టోర్నీలో సందడి చేస్తున్నారు.

    నాగార్జున నట వారసులు

    నాగార్జున నట వారసులు


    నాగార్జున నట వారసుడిగా ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య సినిమా రంగంలో అడుగు పెట్టారు. నాగా చైతన్య ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల నాగ చైతన్య నటించిన తడాఖా చిత్రం మంచి విజయం సాధించింది. త్వరలో నాగార్జున రెండో తనయుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

    English summary
    
 "I will be supporting my team in the semifinals in Bangalore on my birthday (Thursday). My family will also be there with me and since it's been a long time since I celebrated birthday with my family, I'm looking forward to spend time with them," Nagarjuna told IANS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X