»   » కథ విని నాగార్జున ఎంతో ఎక్సైట్‌ అయ్యారు

కథ విని నాగార్జున ఎంతో ఎక్సైట్‌ అయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ కథ విని నాగార్జున ఎంతో ఎక్సైట్‌ అయ్యారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అత్యున్నత సాంకేతిక విలువలు కూడా ఇందులో ఉంటాయి. భారీ తారాగణంతో పాటు అగ్ర సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తారు. హై స్టాండర్డ్స్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నాగార్జున సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని నిర్మాత వెంకట్ మీడియాకు తెలిపారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా వెంకట్‌ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా వివరాలు మీడియాకు తెలియచేసారు.

అలాగే..నాగార్జునగారితో సినిమా నిర్మించాలనేది నా చిరకాల కోరిక. ఆ కోరిక ఈ ఏడాదే నెరవేరుతుండటం చాలా ఆనందంగా ఉంది. ముందెన్నడూ చేయని అద్భుతమైన పాత్రను ఇందులో నాగార్జున చేస్తున్నారు. నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన్ను ఎలాంటి సినిమా చేయాలని ఆభిమానులు ఆశిస్తున్నారో..ఆ స్థాయిలో కథను రెడీ చేశారు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఈ చిత్రం అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ అని సమాచారం. ప్రస్తుతం నాగార్జున..బిందాస్ దర్శకుడు వీరూ పోట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేసే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో గగనం అనే చిత్రాన్ని కూడా చేస్తున్నారు.

Please Wait while comments are loading...