twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైట్ మాస్టర్ల ఆందోళన, నాగార్జున మద్దతు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిబంధనల ప్రకారం తెలుగు సినిమాల్లో తెలుగు ఫైట్ మాస్టర్లకు నిష్పత్తి ప్రకారం అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు దర్శక నిర్మాతలు తెలుగు వారిని పక్కన పెట్టి... బయటి నుంచి ఫైట్ మాస్టర్స్ ను రప్పించి తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు.

    దీనిపై కడుపు మంచి తెలుగు ఫైటర్ మాస్టర్స్ శనివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆందోళనకు దిగారు. తెలుగు సినిమాల్లో లోకల్ వాళ్లకి అవకాశాలు ఇవ్వకుండా ఎక్కడ నుంచో ఫైటర్లను తేవడమేమిటని లోకల్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసారు. ఒప్పందానికి విరుద్ధంగా విజయ్, రామ్-లక్ష్మణ్‌లతో ఫైట్లు చేయిస్తున్నారని వారు నిరసన వెలుబుచ్చారు.

    తెలుగు ఫైట్ మాస్టర్ల నిరసనకు ప్రముఖ హీరో అక్కనేని నాగార్జున సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా ఈ రోజు తన షూటింగును రద్దు చేసుకున్నారు. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి. గతంలోనూ ఫైట్ మాస్టర్లు ఇదే తరహా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

    'కందిరీగ' సినిమా సమయంలో జరిగిన ఫైట్ మాస్టర్ల గొడవ కారణంగా అప్పట్లో.... కొన్ని రోజులు షూటింగులు కూడా బంద్ పెట్టారు. గొడవ కాస్త పెద్దదయి సినీ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారు కూడా ఆందోళనకు దిగారు. కొన్ని చర్చల అనంతరం అంతా సర్ధుకుంది. మళ్లీ అలాంటి తరహా గొడవ మొదలవ్వడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.

    English summary
    Tollywood actor Nagarjuna support to telugu fight masters. He demanded that give to the opportunity to Telugu fight masters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X