నిన్న(బుధవారం)ఓ ప్రక్క యువగర్జన లైవ్ ఛానెల్స్ లో వస్తూంటే మరో ప్రక్క కాంగ్రేస్ పార్టీ వారి ఎడ్వరటైజ్ మెంట్స్ వచ్చాయి. ఇక ఈ రకం పబ్లిసిటీ స్టాటజీ గత కొంత కాలంగా(ఇతర పార్టీల హైలెట్ న్యూస్ వచ్చినప్పుడల్లా) కాంగ్రేస్ వారు అవలంబిస్తున్నదే కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే నిన్నఇన్నాళ్లూ తటస్ధంగా ఉన్న నాగ్ హఠాత్తుగా వైయస్ ని పొగుడుతూ కనపడ్డాడు.దాంతో కాంగ్రేస్ వారి ఏడ్స్ లో వారి వివిధ పథకాలను వివరిస్తూ నాగార్జున కనపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యువ గర్జన లో స్టార్స్ కి పోటీగా కాంగ్రేస్ తరుపున అన్నట్లుగా ఈ వ్యూహాన్ని కాంగ్రేస్ వర్గాలు అనుసరించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే మహేష్ బాబు ఈ తరహా ప్రచారంలో కనపడతాడని ఆశించిన వారికి మాత్రం నిరాశే మిగిలింది.
Story first published: Thursday, July 16, 2026, 23:50 [IST]