నేను ఏ పార్టీ తొత్తునంటే..నాగ్

అలాగే సినీ గ్లామర్ ఉన్న వారంతా రాజకీయాల్లోకి రారని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. అంతేగాక పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోండంటూ పిలుపునిచ్చారు. అలాగే తాను అపోలో ఆస్పత్రికి వెళ్ళినప్పుడు అక్కడ పేద జనాన్ని చూసానని, అంత కార్పోరేట్ వైధ్యం వారెలెగ చేయించుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ ద్వారా అని తెలిసిందంటూ ప్రభుత్వ పధకాలను పొగిడారు. తెలంగాణ విడిపోవటంపై నాగార్జున వ్యతిరేక భావం వ్యక్తం చేసారు. తనకి ఆంధ్రా,తెలంగాణా అనే తేడాలేదని, విడిపోతే పాకిస్ధాన్, శ్రీలంకలా మారుతుందనన్నారు. విడిపోతే చాలా మైనస్ లు బయిటపడ్తాయిని అన్నారు. విడిపోవటం అనేది రాజకీయ అవసరం అని అదే ప్రజలు అవసరం అయితే జరుగుతుందని అన్నారు. తన స్నేహితులంతా తెలంగాణాలో సెటిల్ అయిన వారేనని అన్నారు.


Click it and Unblock the Notifications











