twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగన్ మంత్రి పదవికి నాగార్జున మద్ధతు

    By Staff
    |

    వైఎస్ రాజశెఖర్ రెడ్డిగారు ఎన్నో మంచి పనులు చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించగలమా? చాలా దురదృష్టం ఇది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ, ఆత్మీయంగా హత్తుకునే ఆయన ఇక లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. జలయంతో హరితాంధ్రప్రదేశ్ నిసాధించడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారాయన. రాష్ట్రంలో వైఎస్ చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు ఇకపైనా కొనసాగాలంటే జగన్ కి ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టాలని అభిప్రాయపడ్డాడు సినీ నటుడు నాగార్జున. అందరినీ తన వారిలా భావించే ఆత్మీయ హస్తం ఆయనది. అటువంటి సమర్థుడైన నాయకుడ్ని, నిత్యం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనీ, అదే ప్రజలకోసం వెళ్తూ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని నాగ్ వ్యాఖ్యానించాడు.

    జగన్ కి పగ్గాలు అప్పజెబితేనే రాష్ట్రం సుభిక్షంగా వుంటుందనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చిన నాగ్, రాష్ట్రం మంచి నాయకుడ్ని కోల్పోయిందనీ, ఇంకెవరికీ లేని నాయకత్వ లక్షణాలు వైఎస్ సొంతమని కొనియాడాడు. మొన్నటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించకపోయినా, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు తదితర పథకాలకోసం రూపోందించిన ప్రకటనల్లో నాగ్ దర్శనమిచ్చిన సంగతి విదితమే. ఇందుకోసం నాగార్జునకి వైఎస్ సర్కార్ కొన్ని ఫేవర్స్ కూడా చేసిందంటూ అప్పట్లో బోల్డన్ని వార్తలు విన్పించాయి. ఈ వార్తల్ని నాగార్జున తిప్పికొట్టేయడం, జనం మెచ్చినట్టే నాయకుడిగా అతన్ని తాను ఇష్టపడ్తనని నాగ్ అప్పట్లో ప్రకటించడం తెల్సిన విషయమే. ఇదిలా వుంటే, జగన్ని సీఎం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X