twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వచ్ఛ్ భారత్ ఛాలెంజ్ స్వీకరించిన నాగార్జున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జున ఆరు రోజుల తర్వాత ఎట్టకేలకు అనిల్ అంబానీ విసిరిన స్వచ్ఛ్ భారత్ చాలెంజ్ స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చురుకుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మన దేశాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి అనే నినాదంతో....పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం సాగుతోంది.

    Nagarjuna takes up Swacch Bharat Challenge

    స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్వయంగా పాల్గొని వీధులు శుభ్రం చేసారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడానికి పాటు పడాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

    నరేంద్ర మోడీ తొలుత కమల్ హాసన్, అనిల్ అంబానీ, సచిన్ టెండూల్కర్ మరో ఆరుగురు ప్రముఖులను ఈ కార్యక్రమం కోసం నామినేట్ చేసారు. తర్వాత అనిల్ అంబానీ....నాగార్జున పేరుతో సహా మేరీ కోమ్, సానియా మీర్జా ఇతరులను నామినేట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి కూడా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి తన మద్దతు ప్రకటిస్తూ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే.

    English summary
    Nagarjuna has finally accepted the Swacch Bharat Challenge six days after he was nominated by Anil Ambani to spread awareness about the cleanliness drive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X