ఆయన దయలేకనే డమరుకం వాయిదా: నాగార్జున
కాకినాడ : డమరకం సినిమా ఈ రోజు విడుదలవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులను శాంతింపచేసే ప్రతయ్నం మొదలు పెట్టారు హీరో నాగార్జున.
శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ... ఈశ్వరుడి దయలేకనే సినిమా వాయిదా పడిందని, అభిమానులంతా సినిమా విడుదల కోసం ఈశ్వరుడిని ప్రార్థించాలని నాగార్జున సూచించారు. శివుడు ముహూర్థం పెట్టిన నాడే సినిమా విడుదలవుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, సినిమా త్వరలోనే విడుదల అవుతుందని నాగ్ స్పష్టం చేసారు.
మరో వైపు 'డమరుకం' నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసారు. ఈ రోజు సినిమా విడుదలవ్వాల్సి ఉండగా వాయిదా వేసారని, ఇప్పటికే థియేటర్లకు అద్దె చెల్లించిన తాము సినిమా ఫ్రింట్లు అందక ప్రదర్శన జరుపలేక పోయామని, దీని వల్ల తాము తీవ్రంగా నష్ట పోయామని, ఈ నష్టాన్ని నిర్మాతే భరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా... సినిమా చూసేందుకు థియేటర్ల వరకు వచ్చిన నాగార్జున అభిమానులు సినిమా ప్రదర్శన నిలిచి పోయిందని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసింది. ఫైనాన్షియల్ ఇష్యూల వల్లనే నిర్మాత సినిమా వాయిదా వేసారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











