డైరక్టర్స్ లో క్వాలిటీ చూసే సినిమా ఇస్తాను...నాగార్జున
నాగార్జున కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారన్నదాని గురించి చెబుతూ..చాలా మంది స్క్రిప్టు నచ్చి సినిమా ఓకే చేసామంటారు. కానీ ఆ పద్దతికి నేను వ్యతిరేకం. ఆ దర్శకుడు అనుకున్న కథను క్లియర్ గా తెరకెక్కించే పొటన్షియల్ ఉందా..నిర్మాత సినిమాను ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేసి మంచి ప్రమోషన్ తో విడుదల చేసే సామర్ధ్యం ఉందా అనేవి చూస్తాను. ఎందుకంటే ఎంత మంచి స్క్రిప్టు ఉన్నా ఈ రెండూ లేకపోతే కష్టం కదా అన్నారు. అలాగే నాతో పనిచేసే దర్శకుడు అంతకు ముందు హిట్స్ ఇచ్చి ఉండాల్సిన పనిలేదు.కానీ ఫిల్మ్ మేకింగ్ డైనమిక్స్ తెలిసి ఉండాలి అని అన్నారు.
అలాగే తన ఫెయిల్యూర్ చిత్రం కేడీ గురించి మాట్లాడుతూ..కాన్సెప్టు చాలా డిఫెరెంట్ గా ఉంది..అటువంటి టపోరి పాత్ర నేను ఇంతకు ముందు చేయలేదు..అందులోనూ పంచ్ డైలాగులు నచ్చాయి..కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓ కొత్త తరహా సినిమా చేస్తున్నాను అనే ఆలోచనతో కేడీ చిత్రం చేసాను. కానీ అది వర్కవుట్ కాలేదు.జనం సరిగా రిసీవ్ చేసుకోలేదు అన్నారు నాగార్జున తన తాజా చిత్రం రగడ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా కేడీ ప్లాప్ గురించి చెప్పారు. అలాగే నాగార్డున తాజా చిత్రం రగడ ఎల్లుండి(డిసెంబర్ 24వ తేదీ) విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











