రాయలసీమ బ్యాక్ డ్రాపే కానీ ఫాక్షన్ కాదు..నాగార్జున
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. అయితే ఫాక్షన్ సినిమా కాదు. ఈ సినిమాకోసం మొదటిసారిగా రాయలసీమ యాసలో మాట్లాడుతున్న అంటున్నారు నాగార్జున. అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రియమణి కాంబినేషన్‌లో శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. వీరుపోట్ల దర్శకుడు. డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం యాభైశాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... 'హలోబ్రదర్ చిత్రంలాగా ఈ చిత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్. వీరుపోట్ల 'బిందాస్' చిత్రాన్ని చూశాను. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ బాగా డీల్ చేశాడు. కామాక్షి బ్యానర్ అంటే స్వంత సంస్థలా ఫీలవుతాను. ఆనవాయితీ ప్రకారం డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం' అన్నారు.ఇక నిర్మాత మాట్లాడుతూ...'నాగార్జున కెరీర్‌లో మరో హిట్ చిత్రం అవుతుందనే నమ్మకముంది. ఇప్పటివరకు సగభాగం షూటింగ్ పూర్తయింది' అని తెలిపారు. దర్శకుడు వీరూపోట్ల మాట్లాడుతూ...'ఇది మాస్ ఫిలిం. క్లాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా తీస్తున్నాం. టేకింగ్‌లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్నీ అమరాయి. ధర్మవరపు, బ్రహ్మానందం పాత్రలు హైలైట్ అవుతాయి' అని చెప్పారు.ఇక ఈ చిత్రంలో ఛార్మి చేసిన ఐటమ్ సాంగ్ హైలెట్ కానుంది.


Click it and Unblock the Notifications











